అద్దంకి జామాయిల్ తోట దగ్ధం

అద్దంకి మండలం వెంపరాలలో శుక్రవారం పరిటాల నరసింహారావుకు చెందిన 2 ఎకరాల జామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రైతుకు సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. గోపాలపురంలో వై. మల్లికార్జున రావుకు చెందిన వెదురు చెట్లు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రూ. 10 వేల నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్