గురువారం అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో గుండ్లకమ్మ నదిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినా అతను నీటిలో దూకినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.