అద్దంకి: కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

అద్దంకి మండలం శ్రీనివాసనగర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బి. పూర్ణచంద్రరావు (39) అనే వ్యక్తి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి, పొలానికి వెళ్తున్న పూర్ణచంద్రరావు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పూర్ణచంద్రరావును హైవే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్