అద్దంకి మండలం మణికేశ్వరం వద్ద బుధవారం విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రం పాట్నా ప్రాంతానికి చెందిన వికాస్ జాదవ్ అనే యువకుడు స్థానిక రైతు పశుక్షేత్రం వద్ద పనిచేసే క్రమంలో చాప కట్టర్ ద్వారా పశుగ్రాసం కోస్తుండగా యంత్రానికి విద్యుత్ సరఫరా అయ్యి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఖాదర్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.