ధర్మవరం కొండల మాటున జంతువుల రక్తపుటేరులు

అద్దంకి మండలం ధర్మవరం కొండల మాటున రహస్యంగా జంతువులను వధిస్తున్నారని, వాటి మాంసాన్ని రెస్టారెంట్లకు తరలిస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో కుప్పలుగా జంతు చర్మాలు, ఎముకలు కనిపిస్తున్నాయి. గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఈ వధ జరిగే షెడ్డు చుట్టూ కుక్కలు కాపలాగా ఉంటున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్