రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పేదలకు అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు హర్షించదగినదని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు శనివారం అద్దంకి మండలం అద్దంకిలో మీడియా సమావేశంలో తెలిపారు. వైసిపి ప్రభుత్వం మాదిరి ఇప్పటి ప్రభుత్వం కూడా వారి పార్టీ రంగులు వేయటం తగదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలోచించి అన్న క్యాంటీన్లకు పసుపు రంగును తొలగించాలని కోరారు.