బల్లికురవ: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుండి నరసరావుపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి అని స్థానికులు తెలిపారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్