అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 33వ మైలు వద్ద మంచినీరు తాగేందుకు కాలువలో దిగిన వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని (28) నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పొలం నుంచి తిరిగి వస్తూ ఈ ఘటన చోటుచేసుకుంది. నీటి ప్రవాహ వేగాన్ని గమనించకపోవడమే ప్రమాదానికి కారణమైంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.