ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్

కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అద్దంకిలోని రామాయపాలేనికి చెందిన సురేశ్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని మొదట అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. మేదరమెట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్