అద్దంకిలో కారు-బైక్ ఢీ

శనివారం అద్దంకి-సింగరకొండ రహదారిలోని ఎన్టీఆర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరకొండ నుంచి అద్దంకి వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంతో 108 వాహనంలో క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్