అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని 14 వ వార్డు నందు ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైందంటూ కాలనీవాసులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ బజార్ నందు ప్రభుత్వ రహదారి ఆక్రమణలకు గురవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని వార్డుకు చెందిన మణికంఠ వాపోయారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అనేకసార్లు సమస్యను అధికారులకు దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.