అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తుల పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన మానవునితో పాటు జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లిందని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆయన కోరారు.