అద్దంకి సమీపంలోని సింగరకొండ వద్ద ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డులో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా పేరుకుపోయిన చెత్తకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డంపింగ్ యార్డుకు సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.