అద్దంకి మండలం చక్రాయపాలెంలో బుధవారం మత్స్య శాఖ కార్యాలయం వద్ద జాలర్ల సంఘం ఎన్నికలు జరుగుతుండగా, ఓటు వేయడానికి వచ్చిన గుర్రం వారిపాలెంకు చెందిన మత్స్యకారుడు మహంకాళి వడదెబ్బతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించింది.