591 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఝాన్సీ సాయి శ్రీ 591 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ నిలిచింది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కాగా తల్లి టైలరింగ్ చేస్తారు. తన టీచర్ల సహకారం, మార్గదర్శకత్వంతో మంచి మార్కులు సాధించానని విద్యార్థిని ఆనందం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్