బాపట్ల జిల్లా ప్రజలు బుధవారం పవిత్రమైన కార్తీక పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయాలు ప్రకాశించాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన మణికేశ్వరం ఆలయంలో పుష్పాలతో అలంకరించిన పరమేశ్వరుని త్రిశూలం, ఓం, స్వస్తిక్, శివలింగాకారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ఆలయాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి.