కొరిశపాడు మండలం మేదరమెట్లలోని గాంధీ బొమ్మ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు వద్ద నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని లారీ ఢీకొనడంతో ఆమె కాళ్లపై లారీ వెళ్ళి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.