కొరిసపాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

కొరిశపాడు మండలం మేదరమెట్ల లో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మనపాలెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న అశోక్, రోడ్డు దాటుతున్న మహిళను తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. బొల్లవరప్పాడు గ్రామానికి చెందిన అశోక్ తో పాటు వెనుక కూర్చున్న నాగమణికి గాయాలవడంతో, పోలీసులు వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీరును పోలీసులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్