కొరిశపాడు మండలంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పూరోగాభివృద్ధి సంబంధించి సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ జి. వి. సుబ్బారెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తి చేసిన రీ-సర్వే వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, భూముల రీ-సర్వే త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.