బిసివై పార్టీలో పలువురికి పదవులు.. అద్దంకిలో నియామకాలు

అద్దంకి నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) కన్వీనర్ గా తాళ్లూరి వెంకటకృష్ణ, ఎస్సీ సెల్ కన్వీనర్ గా మార్క్, సోషల్ మీడియా కన్వీనర్ గా అనిల్, యూత్ కో కన్వీనర్ గా నాగేశ్వరరావు లను నియమిస్తూ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ నియామకాలు బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో జరిగాయి. ఈ సందర్భంగా వారు రామచంద్ర యాదవ్, రాష్ట్ర పొలిటికల్ ఎఫెన్స్ కమిటీ సభ్యురాలు సామ్రాజ్యం కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕