బాపట్ల జిల్లా అద్దంకిలోని రామ్ నగర్ కు చెందిన శ్రీను (54) అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఎన్ఎస్పి కాలనీ వద్ద గల అన్నా క్యాంటీన్ సమీపంలో నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.