పంగులూరు మండలం అలవలపాడు జాతీయ రహదారి వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.