అద్దంకిలో 10వ శతాబ్దం నాటి ఆలయం ఇదే

అద్దంకి మండలంలోని ధర్మవరంలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి ఆలయ చరిత్రను పురావస్తు పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి వెల్లడించారు. తూర్పు చాళుక్యుల హయాంలో, సుమారు క్రీ.శ. 950 ప్రాంతంలో భజయరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. చెరువును ఆనుకొని కొండపై కొలువుదీరిన ఈ పురాతన ఆలయం బాపట్ల జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, నాటి నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్