బాపట్ల పురపాలక సంఘంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ముమ్మరంగా ప్రారంభమైంది. పురపాలక సంఘ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం. హాసిని 11వ వార్డు ఇందిరానగర్‌లో పర్యటించి, వృద్ధులకు, అర్హులకు స్వయంగా పెన్షన్ డబ్బులు అందజేశారు.