108వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్న బామ్మ

కారంచేడు గ్రామానికి చెందిన బామ్మ నక్కల సుబ్బులు (108) న్యూయర్ సందర్భంగా కేక్ కట్ చేసుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులు ఆమెకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మనవళ్లు, మనవరాళ్లు కేక్ కట్ చేసి ఆమెతో కలిసి ఆనందం పంచుకున్నారు. సుబ్బులుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు, వారి ద్వారా మనుమళ్లు, మనుమరాళ్లు కూడా కుటుంబంలో ఉన్నారు. 108 ఏళ్ల బామ్మ ఇప్పటికీ యాక్టివ్‌గా తన రోజువారీ పనులు చేయడం ఆశ్చర్యంగా ఉందని కుటుంబం తెలిపింది.

సంబంధిత పోస్ట్