బాపట్లలో శ్రీ శ్వేతార్క గణపతికి విశేష పూజలు

బాపట్ల పట్టణంలోని సుప్రసిద్ధ, 1500 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్ర కలిగిన శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబూ నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పూట స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సంపత్ గణపతికి శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమార్చన పూజలు జరిగాయి. అదేవిధంగా తెల్ల జిల్లేడు కొమ్ముతో రూపొందించిన శ్వేతార్క గణపతికి మహిళా భక్తులు సామూహికంగా ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕