రాష్ట్రంలోనే ఉత్తమ సూపర్ బీచ్ గా సూర్యలంక గుర్తింపు

సూర్యలంక బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్తమ సూపర్ బీచ్‌గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సూర్యలంక బీచ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తన కుటుంబ సమేతంగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకల్లో, సూర్యలంక బీచ్‌ను రాష్ట్రంలోనే ఉత్తమ సూపర్ బీచ్‌గా ప్రకటించారని అయన చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕