పల్నాడు జిల్లాలో బైక్ దొంగ అరెస్టు అయ్యారు. చిలకలూరిపేటలోని ఏఎంజి చెక్ పోస్టు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు అనే బైక్ లు దొంగని శుక్రవారం అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ రమేశ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. అతని వద్ద నుంచి 17 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతను 3 ఏళ్లుగా చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.