చిలకలూరిపేట: అగ్ని ప్రమాదం.. రూ. 4 లక్షల ఆస్తినష్టం

చిలకలూరిపేటలో మంగళవారం ఇళ్లకు మంటలు వ్యాపించి ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారుల వివరాల మేరకు. స్థానిక కళామందిర్ కూడలిలో శివాలయం సమీపంలో పెద కోటయ్యకు చెందిన పూరింటికి నిప్పు అంటుకుంది. దీని పక్కనే ఉన్న ఎస్కే అబ్దుల్ భవనానికి మంటలు రేగాయి. అగ్నిమాపక అధికారి కిరణ్ కుమార్ రెడ్డి, వెంకయ్య, సిబ్బంది సకాలంలో వెళ్లి మంటలు ఆర్పారు. సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.

సంబంధిత పోస్ట్