చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి క్యాంపు కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు 65 మందికి సీఎం. ఆర్. ఎఫ్, ఎల్. ఓ. సి చెక్కులను అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూటమి ప్రభుత్వం అందించే ఆర్థికసాయం గొప్ప భరోసా ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం సీఎం ఆర్ ఎఫ్ నిలిపివేసిందని, కానీ కూటమి ప్రభుత్వం వైద్యానికి సహాయం చేస్తూ, సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రజలకు అందిస్తోందని తెలిపారు.