నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో బుధవారం దూదితో వెళ్తున్న ఒక లారీ అగ్నిప్రమాదానికి గురైంది. లారీలోని దూదికి మంటలు అంటుకోవడంతో పొగలు, మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమయానికి సిబ్బంది చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది, అయితే లారీలోని దూది చాలా వరకు దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.