చిలకలూరిపేట నియోజకవర్గం లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురుసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత 39 డిగ్రీలు ఉండటంతో పట్టణ ప్రజలు వడగాలులకు తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో పొలాల్లో ఆరవేసుకున్న ఎండుమిర్చి, పొగాకు రైతులు గగ్గోలు పెడుతున్నారు.