నాదెండ్ల: పురుగు మందు తాగి వృద్ధురాలు మృతి

నాదెండ్ల మండలంలోని అమీన్సాహెబ్పాలెంకు చెందిన గోరంట్ల సామాజ్యం (80) పురుగు మందు తాగి మృతిచెందింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ మృతిచెందింది. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్