నాదెండ్ల: పంట పొలాల్లో క్షుద్ర పూజల కలకలం

పల్నాడు జిల్లా నాదెండ్ల రెవిన్యూ గ్రామ పరిధిలోని తూబాడు గ్రామ సమీపంలో డ్రాగన్ పండ్ల తోట వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గురువారం విధులకు వెళ్లిన రీసర్వే బృందానికి పూజా సామాగ్రి కనిపించడంతో రైతులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. ఈఘటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచి, నిందితులను పట్టుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్