రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొనడంతో బుర్లవారిపాలెంకి చెందిన కాటూరి శివ (34) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పోలిరెడ్డిపాలెంకు చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం తిమ్మరాజుపాలెం వద్ద హైవే మలుపులో బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. శివ మృతదేహం రోడ్డుపై చెల్లాచెదురుగా పడి భయానక దృశ్యాలు కనిపించాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్

✕
✕