పెన్నానదిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

సిద్ధవటం మండలం లింగంపల్లె సమీపంలో పెన్నానదిలో ఆదివారం ఈతకు వెళ్లిన వంగర జగదీష్ కుమార్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా చెరకుపల్లె మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన జగదీష్ కుమార్, ఐదుగురు స్నేహితులతో కలిసి సిద్ధవటం మండలం లింగంపల్లె శివారులోని పంప్ హస్ వద్దకు వెళ్లారు. భోజనం తర్వాత జగదీష్ కుమార్, స్నేహితుడు నది వద్దకు వెళ్లగా, ఈతకు దిగిన జగదీష్ కుమార్ అకస్మాత్తుగా మునిగిపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్