పెండింగ్ జీతాలకై జులై 1న ఆయాల ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఆయాలుగా పనిచేసే వారికి జీతబకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ డిమాండ్‌ చేశారు. శనివారం చీరాలలో జొన్నాదుల భారతి అధ్యక్షతన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత 4నెలలుగా అయాలకు జీతాలు చెల్లించలేదని చెప్పారు. జులై1న చీరాల ఏంఈఓ ఆఫీసు వద్ద ఈ విషయమై ఆయాలు నిరసన తెలుపుతారని చెప్పారు. ఆయాల సంఘం రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్