270 కేజీలు ఎత్తి తొలి పతకం అందించిన బాపట్ల యువకుడు

చండీగఢ్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026 వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి పతకం లభించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ 88 కేజీల విభాగంలో 270 కేజీలు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మార్చి 26 నుండి ప్రారంభమైన ఈ పోటీలలో ప్రేమ్ సాగర్ ప్రదర్శించిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమైంది. ఆయన విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్