చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

సింగరకొండ సమీపంలోని భవనాసి చెరువులో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చేపల వేట చేస్తున్న జాలర్లు ఈ విషయాన్ని గమనించి అద్దంకి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు జాలర్ల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తరలించారు. సుమారు 40 ఏళ్ల వయసున్న మహిళ, గుండుతో, నైటీ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్