చీరాల: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

శుక్రవారం చీరాల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని బొనిగల ఆదిలక్ష్మి (62) అనే వృద్ధురాలు మృతి చెందింది. బస్సు వెనుక చక్రం తలపైకి ఎక్కడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన ఆదిలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్