చీరాలలోని వాడరేవు సముద్రంలో వేటకు వెళ్లిన ఓసిపిల్లి రమణ(57) అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. చీరాల వాడరేవుకు చెందిన అయన ముగ్గురు మత్స్యకారులతో ఆదివారం వేటకు వెళ్లాడు. సోమవారం రాత్రి నిద్రిసుండగా పడవలో నుంచి జారీ సముద్రంలోకి పడిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ కన్పించకపోవడంతో చివరికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం వరకు ఆచూకీ లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.