చీరాల: గూడ్స్ రైలు ఢీకొని వివాహిత దుర్మరణం

గూడ్స్ రైలు ఢీకొనడంతో వివాహిత దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి ఈపూరుపాలెంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన రాసాబత్తుని లావణ్య రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గ్యాంగ్ మెన్ సమాచారం ఇవ్వగా రైల్వే ఎస్ఐ కొండయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

సంబంధిత పోస్ట్