పేరాలకు చెందిన 74 ఏళ్ల పంభా నాగయ్య, యువకుడిగా క్రీడాకారుడిగా రాణించి, పేదరికం వల్ల క్రీడలకు దూరమయ్యారు. కుటుంబ పోషణ తర్వాత, పిల్లలు పెద్దయ్యాక మళ్లీ క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. పీడీ విజ్ఞాన్కుమార్ మాస్టర్ సలహాతో 25 ఏళ్ల కిందట మాస్టర్ అథ్లెటిక్స్‌లో ప్రవేశించి, అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. లాంగ్ జంప్, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంలో జాతీయస్థాయిలో 15 సార్లు పాల్గొని 10 పతకాలు సాధించారు. మొత్తంగా వివిధ స్థాయిల్లో 25 బంగారు, 15 వెండి, 5 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.