చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. కుందేరు వాగు, రైల్వే బ్రిడ్జి, వాడరేవు పర్యాటక అభివృద్ధి వంటి నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.