చీరాలలో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చైను లాగి ట్రైన్ నుండి పరిగెత్తారు. అయితే బ్రేక్ వేసే సమయంలో రైలు చక్రాలకు రాపిడి జరగడంతో నిప్పురవ్వలు వచ్చాయని ఇది సర్వసాధారణమని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు పరిగెత్తే క్రమంలో పక్క ట్రాక్ పై మరో ఎక్స్ ప్రెస్ రైలు దూసుకుపోయింది.