చీరాల: అవిశ్వాసంపై మొదలైన ఓటింగ్

చీరాలలో పురపాలక సంఘం నందు అవిశ్వాసంపై బుధవారం ఓటింగ్ కార్యక్రమం మొదలైంది. పురపాలక సంఘం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లోపలికి మీడియాను సైతం అనుమతించకుండా కౌన్సిలర్లను మాత్రమే అనుమతించారు. ఏం జరుగుతుందోనని ఉత్కంఠత నెలకొంది.

సంబంధిత పోస్ట్