చీరాల మున్సిపాలిటీ 21వ వార్డులో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగులో ఎమ్మెల్యే మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఏడాది పాలనలో వృద్ధులకు పింఛన్ రూ. 4 వేలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డీఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశామన్నారు. ఇక ఆగస్టు 2 తేదీన అన్నదాత సుఖీభవ పథకం, ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు.