బాపట్ల, చీరాల ప్రాంతాలలో శుక్రవారం రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 16వ వార్షిక సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహించారు. క్విజ్, పద్య పఠనం, చేతి వ్రాత, వివేకానంద చికాగో ఉపన్యాసం వంటి అంశాలపై జరిగిన ఈ పోటీలలో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాలల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, దాతలకు, న్యాయనిర్ణేతలకు సమితి అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, మూర్తి కృతజ్ఞతలు తెలిపారు.