పర్చూరులో టింబర్ డిపోలో అగ్నిప్రమాదం

పర్చూరులోని ఓ టింబర్ డిపోలో బుధవారం అర్ధరాత్రి దాటాక విద్యుత్ షార్ట్ సర్వ్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మాల్యాద్రి, చీరాల, చిలకలూరిపేట ల నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈప్రమాదంలో ఒక కారుతో పాటు కలప దుంగలు కూడ పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్