చెలరేగిన మంటలు.. ఊపిరి ఆడక మృతి

చుండూరు మండలంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మోదుకూరు గ్రామానికి చెందిన బి. రామకృష్ణ (60) అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పొగతో ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి గాయపడిన మరొకరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్